స్వచ్ఛ గ్రామాలే అందరి సంకల్పం కావాలి


Ens Balu
6
Parvathipuram
2022-08-23 10:52:50

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే అందరి సంకల్పం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ (పిఆర్, అర్ డి) ప్రత్యేక కమీషనర్ డా. శాంతి ప్రియ పాండే పేర్కొన్నారు. మంగళ వారం జిల్లా గిరి మిత్ర భవన్ లో డివిజనల్ పంచాయితి అధికారులు, ఎంపీడీఓ లు, ఈ ఓ పిఆర్ డి, పంచాయితీ కార్యదర్శిలు, ఎమ్ అర్ సి లతో సిరా( సర్వెలియన్స్, ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్, ఎనాలిసిస్), ప్లాస్టిక్ వ్యర్దం, చెత్తా చెదారం వేసే స్పాట్, లెగసీ డంపింగ్, సామూహిక మరుగుదొడ్లు నిర్వహణ అంశాల పై జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా చెత్త డంపింగ్ చేసే అలవాటు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుందని, ప్రజల్లో అవగాహన కల్పించి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని  అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమం పక్కగా జరగాలని, పంచాయితీ కార్యదర్శి లు, ఈ ఓ పి అర్ డిలు, డివిజనల్ పంచాయితీ అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. 

పారిశుధ్యం నిర్వహణ పనులను ఉన్నత స్థాయి నుంచి పర్యవేక్షించేందుకు పంచాయితి కార్యదర్శి లకు బాడీ కెమెరా లు ఏర్పాటు చేసి వీడియో కాల్ , ఫొటోస్ ద్వారా ఇంటి పరిసరాలు,పారిశుధ్య పనులు ఎంత మేర నిర్వహించింది పరిశీలించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ క్లాప్ మిత్ర(గ్రీన్ అంబాసిడర్) చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిది ప్రజల మొబైల్ సందేశం ద్వారా తెలుసుకుంటామన్నారు. గ్రామ పంచాయితీ ల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో ఉండాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పాగింగ్ , ఇన్సినిరైటర్స్ యంత్రాలు వినియోగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, జిల్లా మలేరియా అధికారి కె.పైడి రాజు, విజయనగరం డి.ఎఫ్.ఓ ఎస్. వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.