ఎన్ఆర్ఈజీఎస్ , గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్) తదితర నిర్మాణాలకు జిల్లా కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నాడు - నేడు పనులు , ఏఎంసియూ, బిఎంసియూల నిర్మాణం, వైయస్సార్ డిజిటల్ లెబ్రరీ బిల్డింగ్స్, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఏపి టిడ్కో ఇళ్లు , జగనన్న భూహక్కు మరియు భూరక్ష(సర్వే), జాతీయ రహదారులు, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వము తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జివియంసి కమిషనర్ లక్ష్మీషా, డియమ్ &హెచ్ఓ, డిఇఓ, పిడి హౌసింగ్, ఎడి సర్వే వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.