ఘనంగా టంగుటూరి 151 వ జయంతి


Ens Balu
6
Visakhapatnam
2022-08-23 11:04:31

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి సందర్భంగా విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్స్ కే.మాధవి, డా. రాణీ సుస్మిత, డీ.కీర్తి,   పరిపాలన అధికారి ఈశ్వరరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి. మణిరామ్ , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు టంగుటూరి దేశానికి చేసిన సేవలను కొనియాడారు.