అర్హత ఉంటే చాలు నేరుగా అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు శాసనసభ్యులు అలజంగి జోగారావు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పార్వతిపురం పురపాలక సంఘం, కొత్తవలస 4వ సచివాలయం పరిధిలో 9వ వార్డు విజయరామరాజు కాలనీ మరియు నిర్మల కాలనీలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అలజంగి జోగారావు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి నేరుగా ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి సీఎం వై. యఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు , ప్రభుత్వం ఈమూడెళ్ళ పరిపాలనా కాలంలో చేసిన సహాయాన్ని తెలియ చేస్తూ కరపత్రాలు అందజేశారు. అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకున్న వారి వివరాలు తెలుసుకుని వాటిని నమోదు చేయించి వారికి రానున్న కాలంలో అర్హత మేరకు ఆయా పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్టానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసినదిగా అధికారులకు ఆదేశించారు. ప్రతి పేదవానికి సంక్షేమ పధకాలను చేరవేస్తూ అవినీతి రహిత ప్రజారంజక పాలనను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు శాసనసభ్యులకు ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కే రుక్మిణీ, వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవి కుమార్, ఏఏంసి వైస్ చైర్మన్ వి. శంకర్రావు, స్థానిక కౌన్సిలర్ సభ్యులు పొట్నురు జయంతి, మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ వార్డుల కౌన్సిలర్ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, ఏఎంసి డైరెక్టర్లు, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.