అనంతపురం నగరానికి సరఫరా అవుతున్న త్రాగునీరు పూర్తిస్థాయిలో శుద్ధి చేసి పూర్తి స్థాయిలో నగర ప్రజలకు శుద్ధి చేసిన నీటి సరఫరా చేయాలని అధికారులకు నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు.నగర మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య ,కోగటం విజయ భాస్కర్ రెడ్డి లతో కలసి మంగళవారం నగరానికి మంచి నీటి సరఫరా చేసే ముద్దాలపురం వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. నగరంలో రంగుమారిన నీరు సరఫరా అవుతుండటంతో మేయర్, డిప్యూటీ మేయర్లు అధికారులతో కలిసి ముద్దాలపురం వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.పూర్తి స్థాయిలో ఫిల్టరేషన్ ప్లాంట్ లో నీటిని తొలగించి ట్యాంక్ ను శుభ్రపరచి నీటి సరఫరా చేపట్టడంతో ఆ పక్రియ ను వారు పరిశీలించారు.అదే విధంగా అలం,క్లోరినేషన్ పక్రియ ను పరిశీలించారు.
నీటి శుభ్రతను పరిశీలించి పూర్తి స్థాయిలో నీటి శుభ్రతను చేసిన తర్వాతే నగరానికి నీటి సరఫరా చేయాలని అధికారులను మేయర్ వసీం సూచించారు.ఇటీవల కురిసిన వర్షాల వల్ల పీఏబీఆర్ డ్యాం నుండి ముద్దలాపురం ప్లాంటుకు సరఫరా అవుతున్న నీరు రంగుమారి వస్తోందని,పదే పదే శుభ్రం చేసినా రంగు మారిన నీరే వస్తుండటంతో ట్యాంక్ లోని నీరు పూర్తిగా తొలగించి ట్యాంక్ ను శుభ్రం చేయడం జరిగిందని అధికారులు మేయర్ కు వివరించారు.అంతేకాకుండా గతంలో కంటే ఎక్కువగా ఆలం, క్లోరినేషన్ వినియోస్తున్నా మని అధికారులు తెలిపారు.మేయర్ వెంట కార్పొరేటర్‌లు సైఫుల్లా బేగ్,కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి,,ఎస్ఈ నాగమోహన్,ఆడిషనల్ కమిషనర్ రమణా రెడ్డి , డిఇ నరసింహులు,నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.