కాకినాడ జిల్లాలోనే రూ.9కోట్లుకు పైగా..


Ens Balu
4
Kakinada
2022-08-24 06:32:07

కాకినాడ జిల్లాలో వ్యవసాయశాఖలో మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా బినామీ ఈ-క్రాప్ బుకింగ్, చెల్లింపులకు సంబంధించి ఇప్పటి వరకూ 80 మందికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఈఎన్ఎస్ తో ఫోనులో మాట్లాడారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన 80 మందికీ ఆయా మండలాలు, ఆర్బీకేల పరిధిలో ఎంతెంత మొత్తాలకు సంబంధించి చెల్లింపులు జరిగాయనే విషయమై షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం నోటీసులు తీసుకున్న గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు సంజాయషీలు ఇస్తున్నప్పటికీ అవి సత్యదూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. కొన్ని చోట్ల సచివాలయ వ్యవసాయ సహాయకులు చేసిన ఈ-క్రాప్ బుకింగ్ కు, రెవిన్యూ రికార్డుల ద్వారా విచారణ చేసిన దానికి పొంతన కుదరడం లేదని తెలియజేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్నవారి వివరాలను.. పూర్తిస్థాయి విచారణ జరిపి..వాస్తవాలను జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కి నివేదికలు సమర్పించనున్నట్టు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ వివరించారు.