రక్తదాతలే నిజమైన ప్రాణ దాతలు..


Ens Balu
4
Visakhapatnam
2022-08-24 06:59:23

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు.  బుధవారం ఆమె సీతమ్మధార ఓ ప్రైవేటు కార్యాలయం వద్ద నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వలన మరో ప్రాణం నిలబెట్ట వచ్చుని తెలిపారు. అందుకు పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాపిడ్ బైక్ టాక్స్ సంస్థను మేయర్ అభినందించారు. రాపిడ్ సంస్థ అంటే ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడమే కాకుండా ఇటువంటి సామాజిక సేవ చేయడం అభినందించదగినదని తెలుపుతూ ఆ సంస్థ ప్రతినిధులైన ఎం వి ప్రసాద్, పి మురళి లను అభినందించారు.  ఇటువంటి సామాజిక సేవ తో ముందుకు వచ్చిన ప్రతి సంస్థను, ఆర్గనైజింగ్ వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని, ఇటువంటి రక్తదాన శిబిరాలను ప్రతి చోట ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకులలో  నిల్వలు పెంచాలని, రక్తం దొరకలేదని ఏ ఒక్కరూ మరణించ కూడదని తెలిపారు.