9మందికి సర్వీసు ప్రొబేషన్ రెగ్యులైజేషన్..


Ens Balu
6
Kakinada
2022-08-24 07:09:23

కాకినాడ జిల్లాలోని మరో 9 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొభేషన్ రెగ్యులర్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లాలోని ఆయా గ్రామసచివాలయ మహిళా పోలీసుల పనిచేసే సచివాలయాలకు ఈ ఉత్తర్వులు చేరాయి. ప్రస్తుతం వీరంతా సర్వీసులో ఉండగా మెటర్నటీ లీవు తీసుకున్న సందర్భంగా వీరి సర్వీసు ఆరునెలలు అదనంగా ప్రభుత్వం పొడిగించింది. దీనితో పోయిన నెలలో ఉద్యోగులందరితో పాటు వీరికి సర్వీసు రెగ్యులర్ కాలేదు. ఆగస్టు నెలలో వివిధ తేదీల్లో వారికి రెండేళ్లు సర్వీసు ప్రొభేషన్ పూర్తికావడంతో వారందరికీ ఒకేసారి ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు అందుకున్నవారంతా ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో సీఎఫ్ఎంఎస్ ఐడీల ద్వారా ఉత్తర్వులను ఆన్ లైన్ చేయించుకున్నారు. రేపటితో సాలరీ బిల్లులు పెట్టడానికి సమయం ముగిసిపోవడంతో అంతా ఒకేసారి జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఆన్ లైన్ చేయించుకున్నారు. దీనితో 9మందికి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయి సెప్టెంబరు నెల నుంచి పూర్తిస్థాయి పేస్కేలు పొందనున్నారు.