రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం


Ens Balu
13
Rajamahendravaram
2022-08-24 09:36:57

రీ సర్వే చేపట్టడం ద్వారా భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారించేందుకు వంద సంవత్సరాలు తర్వాత జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం ద్వారా సర్వే చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం "జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం "పై సర్వేయార్ల శిక్షణ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్,  ఎమ్మేల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 1920 సంవత్సరంలో అప్పటి అధికారులు భూ సర్వే చేపట్టి భూ రికార్డులను నిబద్దతతో ఆధునికరించారన్నారు. స్పందనగా కార్యక్రమంలో గానీ , ప్రజలు అందజేసే వినద్దుల్లో గాని ఎక్కువ శాతం భూ సంబంధ సమస్యలు అంశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గత వంద సంవత్సరాలుగా భూ రికార్డులు ఆధునీకరించిపోవడం కొనుగోలు అమ్మకాలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన రికార్డుల లో మార్పులు చేయకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా పథకం ద్వారా భూ సర్వే నిర్వహించి, భూ రికార్డుల స్వచ్చికరణ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న భూ యజమాని పేరుతో భూ రికార్డుల సర్వే ద్వారా కొత్త సర్వే నంబర్ కేటాయించడం కోసం ఈ ప్రక్రియ ను చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సర్వే లో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలు నిబద్దతతో,  సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని ఖచ్చితమైన విధానం లో నమోదు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలక్ష్యం ప్రదర్శించరాదని తెలియచేశారు. 

దేశంలోనే ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి దానికి లాజికల్ కంక్లుజన్ (తార్కిక ముగింపు) తీసుకుని రాగలిగిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమన్నారు. ప్రతి న్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని  పైలెట్ గా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసి, పత్రాలు అందజేశామని, గ్రామ సచివాలయం వద్ద నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో పరిమితి సంఖ్యలో మానవ వనరులు ఉండేవని, ప్రస్తుతం మన దగ్గర 96 సచివాలయం వద్ద సర్వేయర్లు, మరో నలుగురు సిబ్బంది కూడా ఉండడం వల్ల సర్వే మరింత సులభతరం కానున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్దతతో సర్వే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎంపీ మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, ప్రతి పేదవానికి, సామాన్యునికి మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వే ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్రక్రియ చేపట్టినా సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యం చెయ్యక పోవడం చుసామన్నరు. ఐతే ముఖ్యమంత్రి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూ రికార్డుల సర్వే చేపట్టే దిశగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ను అంతే నిబద్దతతో చేపట్టవలసి ఉందని ఎంపి తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ పురపాలక సంఘాలు పరిధిలో చేపడుతున్న ఈ భూ సర్వే పనులు అత్యంత జాగ్రత్తగా పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల లో చేపట్టిన సర్వే సమర్థవంతంగా చేపట్టిన దృష్ట్యా వాటి నుంచి పొందిన అనుభవాన్ని మనకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకుని, తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలని కోరారు.శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో నిర్వహించిన సర్వే తరువాత ఇంత లేటెస్టు ఎక్యుప్ మెంట్ వినియోగిస్తూ ఖచ్చితంగా హద్దులను నిర్ణయిస్తూ చేస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. రీసర్వే చేయడం పట్ల రైతులు నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఇప్పటి వరకు రీసర్వే వూర్తియిన గ్రామాల్లో ప్రజలు మంచి స్పందన  వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు  మాట్లాడుతూ, సర్వే చేపట్టే ప్రక్రియ పూర్తి వివరాలు కలెక్టర్ ద్వారా సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. సర్వే ప్రక్రియ పూర్తి అయ్యేలా పనితీరు చూపాల్సి ఉందని తెలిపారు. ఈ శిక్షణా సమావేశానికి  శాసన సభ్యులు జక్కంపూడి రాజా, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, ఆర్ ఎమ్ సి అధికారులు, మునిసిపల్ సచివాలయ వార్డు సర్వే, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.