గురజాడ మహా గొప్ప దార్శినీకుడు..
Ens Balu
0
Vizianagaram
2020-09-21 12:45:33
విజయనగరం జిల్లాలో సోమవారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహా కవి గురజాడ అప్పారావు 158 వ జయంతిని గురజాడ స్వగృహంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవేడుకల్లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన అప్పల నాయుడు, మాజీ ఎం.పి. బొత్స ఝాన్సీ, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు గురజాడకు నివాళులు అర్పించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆరోజుల్లో గొప్ప పరిష్కారం చూపిన దార్శినికుడని కొనియాడారు. భావితరం అంతా గురజాడ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఆయన నేర్పిన స్పూర్తి ఎందరినో ప్రభావితం చేసిందని కలెక్టర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయాన్ని ఆలపించిన సంగీత కళాశాల విద్యార్థులు ఆలపించారు.