అల్లూరిసీతారామరాజు జిల్లాలో మాతా, శిశు మరణాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఐసిడిఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ఐసిడిఎస్ ద్వారా అందించే అన్ని సేవలు సంబంధిత యాప్ లలో అప్లోడ్ చేయాలనీ, జిల్లా డాష్ బోర్ద్ లో ప్రకటించాలని సూచించారు. సిగ్నల్ సమస్య ఉంటె, ఆఫ్ లైన్ లో నమోదు చేసి సిగ్నల్ ఉన్న దగ్గర ఆన్ లైన్ చేయాలనీ సూచించారు. జిల్లాలో 20 నుండి 25 శాతం పిల్లలకు ఇమ్మ్యునైజేషణ్ జరగటం లేదని, వారందరినీ గుర్తించి వారికి వ్యాధి నిరోధక మందులు అందజేయాలని ఆదేశించారు. వైద్య అధికారులు, సిబ్బంది సహకారంతో మందులు తీసుకోవాలన్నారు. రక్త హీనత ఉన్న తల్లుఅలను, బిడ్డలను గుర్తించి వారిపై ప్రత్యెక శ్రద్ధ కనపరచాలన్నారు. బరువు, ఎత్తులను ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకనుగునంగా వారికి పౌష్టికాహారం అందచేయాలన్నారు. ఇక నుండి ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని, సమీక్షలకు తగిన వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. జిల్లలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి నివేదిక అందచేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రక్త హీనత, ఎదుగుదల లేకపోవటం, నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి స్పాట్ ఫీడింగ్ ఇవ్వాలన్నారు. సిడిపిఒలు, సుపెర్వైజర్లు ప్రతి అన్గావాడి కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడి కార్యకర్తలు, వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, మహిళా పోలీస్ లతో సమావేశమై తగు సూచనలు జారీ చేసి అవగాహనా కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయిన సరుకులు, పంపిణీ చేసిన, మిగిలిన స్టాక్ తో సరిపోల్చాలన్నారు. సందర్శనలలో గ్రోత్ మోనటరింగ్ పై శిక్షణ ఇవ్వాలన్నారు.
ప్రతి సిడిపిఒ గర్భిణీల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేసి వారితో ఎప్పటికప్పుడు మాటాడి వారికి ధైర్యం కల్పించాలని, అవసరమైన సూచనలు అందచేయాలని ఆదేశించారు. గర్భినీలకు సేవలు అందించటం కోసమే మీరున్నారని గుర్తించాలని, వారికి సేవలు అందించ లేకపోతె మీకు జీతాలు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలకు రక్త హీనత, పౌష్టికాహారం, ఎదుగుదల, లో వెయిట్, ఆరోగ్యం తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. లేక్టింగ్ స్త్రీలను ట్రాక్ చేసి వారికి సరైన రీతిలో మందులు అందచేయాలన్నారు. అనీమియా నిర్వహణలో సచివాలయ మహిళా పోలీసులు స్పందించటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఎస్పి సతీష్ కుమార్ తో మాటాడి వారికి తగు సూచనలు జారీ చేయాలనీ కోరారు. అదేవిధంగా సచివాల్యాలకు ఒక సర్క్యులర్ పంపించాలని సూచించారు.
జిల్లాలో 131 అంగన్వాడి కేంద్రాలకు నాడు- నేడు కింద అభివృద్ధి చేయటానికి కేంద్రానికి రూ.13.50 లక్షలు మంజూరైనందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అందుకు అవసరమైన కమిటీసభ్యుల వివరాలు తీసుకుని ఆధార అప్డేట్ చేయించి సంబంధిత బ్యాంకు లలో ఖాతాలు తెరిపించాలని, తద్వారా అంగన్వాడి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. హుకుంపేట ప్రాజెక్ట్ పరిధిలో నాణ్యమైన సరుకులు పంపిణీ కావటం లేదని, సిడిపిఒలు కలెక్టర్ దృష్టికి తీసుక రాగా ఆయా కాంట్రాక్టర్లను గురువారం తన వద్ద హాజరు పరచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మి, పాడేరు డివిజన్ లోని అంగన్వాడి ప్రాజెక్ట్ ల సిడిపిఒలు, సూపెర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.