ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారులు, సిబ్బంది ప్రధాన కేంద్రంలోనే ఉండి సమయపాలన పాటించి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మరియు సిబ్బందితో సమీక్షా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రాలలో వైధ్యాదికారులు నిరంతరం సందర్శనలు చేపట్టి అవసరమైతే వైద్య శిభిరాలను నిర్వహించాలని, రోగులకు అందించిన వైద్య సేవలు అందుబాటులో ఉన్న మందులు వివరాల రిపోర్టులను సంబందిత అధికారుల ద్వారా పంపించాలని కోరారు. గ్రామ సందర్శనల ద్వారా గుర్తించిన గర్భిణి స్త్రీలను నమోదుచేసి చెకప్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం జరుగునట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పధకం ద్వార గర్భిణిలకు పౌష్టికాహారం నిమిత్తం విడతల వారిగా అందించే పారితోషికం విషయమై వారి పూర్తీ వివరాలను పోర్టల్ లో నమోదుచేసి సకాలంలో నగదు అందునట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిపెరులో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అంబులెన్స్ లను వారం రోజులలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
మాత్రు మరియు శిశు సేవల వివరాలను సకాలంలో యం.సి.హెచ్ పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. మాత్రు శిశు మరణాలు జరిగిన వెంటనే సదరు వైధ్యాదికారి విచారణ జరిపి వెంటనే సంబందిత కారణములను జిల్లా శాఖకు పంపాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ యొక్క సేవల పోర్టల్ లో నమోదుచేసిన రిపోర్ట్ లపై సమీక్షను నిర్వహించిన కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. మరో రెండు వారాలలో తిరిగి సమిక్ష నిర్వహిస్తానని, ఆరోగ్య శాఖ యొక్క సేవల పోర్టల్ లో నమోదుచేయాల్సిన రిపోర్ట్ లను త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు మరియు సిబ్బంది ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదుచేయాలని ఆదేశించారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. సుజాత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కే లీలా ప్రసాద్రు, డి.టి.సి.ఓ డా. టి. విశ్వేశ్వర రావు నాయుడు, డి.ఐ.ఓ డా. ప్రభావతి గారు, పి.ఓ. డి.టి.టి. డా. ప్రభావతి గారు, 35 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది పాల్గున్నారు.