మూఢాచారాలను రూపుమాపిన మహామనిషి గురజాడ..


Ens Balu
3
గురజాడ కళాక్షేత్రం
2020-09-21 12:57:40

వ్యవహరిక భాషోద్యమానికి అంకురార్పణ  చేసిన వ్యవహార మహావ్యక్తి గురజాడ అప్పారావు  అందించిన సేవలు చిరస్మరణీయమని జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం గురజాడ 158వ జయంతి వేడుకలును ఉడా గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ, మూఢా చారాల ముసుగులో జరిగే అమానుషాలను ఖండించడంతో పాటు, తెలుగు పదకవితకు ముత్యాలసరాలను అలంకరించిన ధన్యజీవి అని ప్రశంసించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు కథావనంలో తొలి కథా దిద్దుబాట్లు వెలయించిన ఆధునిక తెలుగు కథా సృష్టికర్త గురజాడ మాత్రమేనన్నారు. దేశమంటే మట్టికాదోయ్..దేమశమంటే మనుషులోయ్  అని గొప్ప జీవిత సత్యాలని జాతికి చాటి చెప్పిన మహాకవి అన్నారు. ఈ కార్యక్రమం లో ఏయూ విద్యార్థి నాయకులు విఎన్ మూర్తి, ఏపి నిరుద్యోగ  జేఏసీ విశాఖజిల్లా అధ్యక్షులు సనపల తిరుపతిరావు, శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు ఎం.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.