నేతన్న నేస్తం క్రింద రూ.2.44 కోట్లు


Ens Balu
4
Bhimavaram
2022-08-25 07:50:02

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2022 - 23 వ సంవత్సరం లో నాలుగో విడతలో అర్హులైన 1017 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి.తెలిపారు. చేనేత కుటుంబాలకు స్వంత మగ్గం ఆధునికీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు ఈ పథకం ఉద్దేశించబడినదని కలెక్టర్ తెలిపారు.ప్రతీ సంవత్సరం 24,000 రూపాయల చొప్పున అర్హులైన  ప్రతీ చేనేత కుటుంబాలకు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2019 - 20వ సంవత్సరంలో మొదటి విడతలో అర్హులైన 854 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద 2020 - 21వ సంవత్సరంలో రెండవ విడతలో అర్హులైన 1067 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 56  లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేశారని పేర్కొన్నారు.
 ఈ పథకం కింద 2021 - 22వ సంవత్సరంలో మూడవ విడతలో అర్హులైన 779 మంది లబ్ధిదారులకు 24 వేల రూపాయల చొప్పున కోటి  87 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి తెలిపారు.

  ఈరోజు  కృష్ణా జిల్లా పెడన నుంచి వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పాల్గొనగా.. భీమవరం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి., చేనేత జౌళి శాఖ ఎడి కె.అప్పారావు,  ఏ డి ఓ కె. చేతన్ , చేనేత లబ్ధిదారులకు 2.4 కోట్ల రూపాయలు చెక్కును అందచేశారు.