పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు (ఏపిఎంఐపి) ప్రాజెక్టు డైరెక్టర్ గా ఎల్.శ్రీనివాస రావు బాధ్యతలను స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా సూక్ష్మ నీటి పారుదల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చేలా రైతులకు మేలు చేకూర్చలని కలెక్టర్ సూచించారు. ఈయన నెల్లూరు ఉద్యాన వన అధికారిగా పనిచేసి పార్వతీపురం మన్యం జిల్లాకు సూక్ష్మ నీటి పారుదల శాఖ అధికారిగా వచ్చారు.