విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ ల ఆర్.డి.ఓ.లు, 26 మండలాల తహశీల్దార్ లకు అధికారిక మొబైల్ నెంబర్ లు కేటాయిస్తూ వారికి ప్రభుత్వం తరపున సిమ్ కార్డులు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి తెలిపారు. జిల్లా ప్రజానీకం రెవెన్యూ అధికారులను వివిధ సమస్యలపై సంప్రదించేందుకు ఈ అధికారిక ఫోన్ నెంబర్ లను వినియోగించ వచ్చని పేర్కొన్నారు. ఈ నంబర్ లకు వాట్సప్ కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా యంత్రాంగం తోను, ప్రజలతోను దైనందిన అధికార కార్యకలాపాల్లో ఈ నంబర్ లనే వినియోగించాలని కలక్టర్ అధికారులకు సూచించారు. ఆయా రెవెన్యూ డివిజన్, మండలాల తహశీల్దారు లకు కేటాయించిన నంబర్లు ఆయా అధికారులు వేరొక చోటుకు బదిలీ అయినప్పటికీ మండలంలో అదే నంబర్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్, తహసిల్దార్ ల కొత్త మొబైల్ ఫోన్ నెంబర్ లు ఈ ప్రకటనకు జత చేయడం జరిగింది.