హరిదాసులు హిందూ ధర్మ ప్రచారకులు


Ens Balu
12
Tirupati
2022-08-25 14:34:09

హరిదాసులు గ్రామాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారకులని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నుంచి ప్రారంభించిన శ్రీవారి  త్రైమాసిక మెట్లోత్సవ శోభా యాత్ర మూడవ సత్రాల వద్దకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జెఈవో మాట్లాడారు.  హిందూ ధర్మప్రచారంలో దాస సాహిత్య ప్రాజెక్టు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 7200 భజన మండళ్లు ఉన్నాయన్నారు. వీరందరూ తమ గ్రామ పరిధిలో ఉన్న మిగిలిన అన్ని భజన మండళ్లను కలుపుకుని ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని యువత తో పాటు చిన్నారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ఆనంద తీర్థ  జెఈవోను సన్మానించారు.