నిస్వార్ధ సేవకు, మానవత్వపు విలువలకు ప్రతిరూపంగా మదర్ థెరిస్సా నిలుస్తారని జిల్లా ఫారెస్ట్ అధికారి నరేంధ్రన్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో కొలువుదీరిన మదర్ థెరిస్సా 112వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదర్ థెరిస్సా విగ్రహానికి డిఎఫ్ఓ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితాన్ని అనాధలు, చిన్నారులు సేవకు అంకితమిచ్చిన మహనీయురాలు మదర్ థెరిస్సా అన్నారు. విదేశాల్లో జన్మించి భారతదేశంలో ఆపన్నుల సేవకు తపించిన మానవతామూర్తిగా ఆమె పేరుగాంచారని డిఎఫ్ ఓ తెలిపారు. ప్రేమ, దయ, సేవ మనిషి జీవిన విధానంగా మలుచుకోవడమే నిజమైన నివాళి అని నరేంధ్రన్ అన్నారు. భావితరాలకు సేవ, మానవత్వం
పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని గాంధీ మందిరం నిర్వాహకులు నటుకుల మోహన్ డిఎఫఓ కు వివరించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని మదర్ థెరిస్సా హోమ్ ఆశ్రయం పొందుతున్నవారి కోసం రూ.15 వేలు విలువచేసే నిత్యావసర సరుకులను డిఎఫ్ ఓ తన తరపున అందజేశారు. గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డిఎఫ్ ఓ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జామి భీమశంకర్, నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్, బాఠాన దేవభూషణ్, జీఎన్ జ్యూయలరీ అధినేత గుడ్ల శ్యామ్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, నక్క గౌరీశంకరరావు, గుత్తు చిన్నారావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.