మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ


Ens Balu
5
Srikakulam
2022-08-26 12:49:44

కన్సిస్టెంట్  రిధం పనులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి, పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లాలో నిర్వహిస్తున్న కన్సిస్టెంట్  రిధం పనుల పురోగతిపై నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట , రణస్థలం మండలం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎ.ఎన్.ఎం, మహిళా పోలీసులు తమ పరిధిలో ఉన్న పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన పరిశీలించి కన్సిస్టెంట్  రిధం యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందు నిమిత్తం పాఠశాల నిధుల నుండి గాని గ్రామ పంచాయతీ నిధుల నుండి పరిష్కరించాలని. మీ స్థాయిలో పరిష్కారం కానీ పనుల పరిష్కారానికి పై అధికారులకు పంపించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. నేటికీ చేట్టిన పనులపై పాఠశాలల వారీగా నివేదికలు చూపించాలని అదేశించారు. పనుల నిర్వహణపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు. అలాగే పనుల నిర్వహణలో అత్యధిక పెండెన్సి శ్రీకాకుళం జిల్లా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణలో పురోగతి చూపని మందస ఎం.ఇ.ఓ కి షోకాజ్ నోటీస్ జారీ చేయమని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పరిషత్ సి.ఇ ఓ వెంకటరమణ, నందిగాం, సంతబొమ్మాళి, మందస, సోంపేట, రణస్థలం, హిరమండలం మండలాల ఎం.పి డి.ఓ లు, మండల విద్యాశాఖాధికారులు హాజరయ్యారు.