మంత్రి మెరుగు నాగార్జున జిల్లాకు రాక


Ens Balu
2
Vizianagaram
2022-08-26 13:14:27

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున ఈ నెల 27వ తేదీ శనివారం మధ్యాహ్నం జిల్లాకు వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు నగరంలోని జెడ్పీ అతిథి గృహానికి చేరుకొని మధ్యాహ్నం 4.00 గంటలకు డి.ఎస్.డబ్ల్యు.ఓ., ఇ.డి., ఎస్.సి.కార్పొరేషన్, జిల్లా అంబేడ్కర్ గురుకులాల సమన్వయ అధికారులతో జెడ్పీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 వరకు నగరంలోని ఎస్.సి.లబ్దిదారులకు మంజూరు చేసిన యూనిట్లను, వారికి కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ లను, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ను పరిశీలిస్తారు. సాయంత్రం 7 గంటలకు విశాఖ బయలుదేరి వెళ్లనున్నారు.