కోవిడ్ సందేహాలపై తల్లిదండ్రులకు అవగాహనక..కలెక్టర్


Ens Balu
1
Kakinada
2020-09-21 14:03:25

ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి చేసే తరగతులు ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. కోవిడ్-19 తర్వాత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద నున్న పి ఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలో సోమవారం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించి,కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 9 ,10 తరగతులకు సంబంధించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సమ్మతితో సందేహాల నివృత్తి తరగతులు  జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యార్థులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు, ఇతర  సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది అన్నారు. తల్లిదండ్రులకు ఏవిధమైన సందేహాలు ఉన్నా పాఠశాల ఉపాధ్యాయులు వద్దకు వచ్చి వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొవిడ్  పట్ల భయం ఆందోళన చెందాల్సిన పనిలేదని, అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. డి ఆర్ డి ఎ ద్వారా ప్రతి విద్యార్థికి మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా 50 శాతం విధులకు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. అనంతరం  కలెక్టర్  9,10 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మరియు మాస్క్ ను అందజేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు నిర్మాణ పనులు విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్రహం, డి వై ఇఓ వై.జయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాచిరాజు, ఉపాధ్యాయులు ,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.