పశ్చిమగోదావరి జిల్లాలో ఈక్రాప్ నమోదు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జెవి మురళి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీ లోగా ఈ క్రాప్ నమోదు పూర్తి చేయాలని ఆయన అన్నారు. సి సి ఆర్ సి కార్డులు అర్హులైన కౌలు రైతులందరికీ నిర్నిత గడువులోగా ఇప్పించాలని, పిఎం కిసాన్ లో అర్హులైన రైతులకు అందరికీ ఈ కేవైసీ చేయించాలని ఆయన ఆదేశించారు . విత్తనాలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసి నమూనాలు సేకరించి కల్తీ లేని నాణ్యమైన ఇన్పుట్స్ రైతులకు అందించాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు జిల్లాలో మండల వ్యవసాయ అధికారులు. అనంతరం వ్యవసాయ సంచాలకుల గుంటూరు వారి కార్యాలయం నుండి వచ్చిన సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి డి వి కృపా దాస్ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం పై జిల్లా వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించారు.