సాలూరు మార్కెట్ కమీటీ పరధి సాలూరులో శీతలీకరణ గిడ్డంగుల ప్రతిపాదనలు తక్షణం సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనులపై జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. సాలూరు, పాచిపెంటలలో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పార్వతీపురం రైతు బజార్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమగ్ర పరిశీలన చేసి సంర్పించవలసినదిగా ఆదేశించారు. పాలకొండ రైతు బజార్ కు డి.సి.ఎం.ఎస్ నుండి అద్దె ప్రాతిపదికన స్థలం సేకరించుటకు ప్రతిపాదనలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమీషనర్ కు సంర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి యల్ .ఆశోక్ , ప్రత్యేక శ్రేణి కార్యదర్శి బి. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.