విద్య, వైద్యం, క్రీడా, కళా రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు 2023, మార్చి 8న అందజేసే నారీశక్తి పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు. అర్హులైన మహిళలందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఓ ప్రకటన ద్వారా సూచించారు. పురస్కార గ్రహీతకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.2 లక్షల నగదు, ప్రశంశా పత్రం అందజేస్తుందని వివరించారు. కావున 25 సంవత్సరాల వయసు నిండి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేసే మహిళలు, అసంఘటిత రంగంలో సేవలందించే మహిళలు www.awards.gov.in వెబ్ సైట్ ద్వారా అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత హార్డ్ కాపీలను జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. ఇతర వివరాలకు 94904 98932 నెంబరును సంప్రదించాలని సూచించారు.