ధాన్యం కొనుగోలుకు ఈ-క్రాప్ లో తప్పనిసరి


Ens Balu
6
Parvathipuram
2022-08-27 07:37:46

ఈ- క్రాప్ లో నమోదు ఉంటేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్  తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న ఖరీఫ్ 2022-23 సీజనకు సంబంధించి జిల్లాలో ధాన్యము పంట ప్రక్రియ ప్రారంభమైందని, నిబంధనల ప్రకారం ఈ- పంట నమోదు చేసుకున్న రైతుల వద్ద నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  వ్యవసాయ శాఖ ఇప్పటికే ఇ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు.   జిల్లాలో 306 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఇ పంటలో తమ పేర్ల నమోదు పరిస్థితిని రైతులు పరిశీలించి అవసరమైతే  దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వెంటనే నమోదును చేసుకోవాలని కోరారు. ఈ-పంట లో పేర్లు నమోదు కాకపోతే మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.  రైతులు అందరూ ఇ-పంట నమోదును వెంటనే పూర్తిచేసుకుని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందుటకు ఇప్పటి నుండే శ్రద్ద వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.