ప్రభుత్వంపై వివిధ సంస్థలు, వ్యక్తులు న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసుల్లో ఆయా శాఖల తరపున సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడంపై దృష్టి సారించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు కోరారు. ఏ.పి.ఆన్ లైన్ లీగల్ కేసుల నిర్వహణ వ్యవస్థ ద్వారా ఆయా కేసుల పరిష్కారంపై డి.ఆర్.ఓ. శనివారం తన ఛాంబరులో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన కోర్టు కేసులపై ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా తాజా పరిస్థితులు తెలుసుకుంటూ తగిన విధంగా కౌంటర్లు దాఖలు చేసి ప్రభుత్వ వాదనను సమర్ధంగా కోర్టుల్లో వినిపించాలన్నారు. ఈ సమావేశంలో సి- సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, పలువురు తహశీల్దార్‌లు పాల్గొన్నారు.