విశాఖ, అనకాపల్లి,పాడేరు జిల్లాల తూర్పు కాపు కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సంఘం అధ్యక్షులు ఏ.వి. రమణయ్య ఆధ్వర్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మింది లోని అతని క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో తహసీల్దార్లు చేస్తున్నా జాప్యంపై విశాఖ, అనకాపల్లి, జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని, దానిపై స్పందన లేదని మంత్రి అమర్ నాథ్ కు తెలియజేశారు.విశాఖ,అనకాపల్లి, పాడేరు జిల్లా కలెక్టర్లతో రెవిన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తూర్పు కాపులకు బీసీలకు ఏవిధంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారో అదేవిధంగా తూర్పు కాపులకు కుల దృవీకరణ పత్రాలు జారీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అమర్నాథ్ ను కోరారు. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జాప్యo లేకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయ చేయవలసినదిగా అమర్నాథ్ ని కోరారు. నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలలో గల తూర్పు కాపులు 52 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీ సర్టిఫికెట్లు పొందలేకపోయారని సంఘం ప్రతినిధులు తెలిపారు. తూర్పు కాపులు సకాలంలో బీసీ సర్టిఫికెట్లు పొందకపోవుటవలన తమకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశములు కోల్పోతున్నారని అన్నారు. అందువలన ఇతర బీసీల వారి మాదిరి దరఖాస్తు చేసుకున్న వెంటనే తూర్పు కాపులకు కూడా బీసీ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించే వలసిందిగా అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీని కూడా కోరినట్లు రమణయ్య తెలియజేశారు.
తూర్పు కాపులకు ఓసి సర్టిఫికెట్లు ఇచ్చి కొంతమంది అధికారులు తూర్పు కాపులను ఓసీలుగా చేయుటకు ప్రయత్నించుచున్నారని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ మూడు జిల్లాల కలెక్టర్లతో, సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను శాశ్వతముగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రమణయ్య తెలియజేశారు. మంత్రి అమర్ నాథ్ ను కలిసిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షులు బొండా అప్పారావు, ప్రధాన కార్యదర్శి మురిపిండి సన్యాసిరావు, జిల్లా ఉపాధ్యక్షులు కంపర సత్తిబాబు, గోపాలపట్నం తూర్పు కాపు కమిటీ అధ్యక్షులు కంపర కోటేశ్వరావు, జిల్లా శాఖ కార్యదర్శి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాకవరపాలెం కమిటీ అధ్యక్షులు గొంతిని హరిబాబు, నాగరాజు, హరనాథ్, చీకట్ల నాగేశ్వరావు, కొల్లన రాజేశ్వరరావు, విప్పల ప్రసాద్, సేనాపతి శంకర్ రావు, సేనాపతి దేవుడు, దేముడు తదితరులు ఉన్నారు.