పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వారికి సహకరించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ క్రింద సింగల్ డెస్క్ పోర్టల్ ను పర్యేక్షించడానికి ప్రతి లైన్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నామినెట్ చేయాలని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే మన జిల్లా ఈఒడిబి లో మొదటి రాంక్ లో ఉందని, ఈ రాంక్ ను కొనసాగించే చర్యల్లో భాగంగా నోడల్ అధికారులను వెంటనే నియమించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జె.సి మాట్లాడుతూ పరిశ్రమ ల ఏర్పాటు కోసం గుర్తించిన భూములను క్షున్నంగా తనిఖీ చేసి వచ్చే సమావేశం లోగా నివేదిక ఇవ్వాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజు కు సూచించారు. భోగాపురం లో అపెక్స్ హెచరీస్ వారు యూనిట్ స్థాపనకు దరఖాస్తు చేసుకున్నారని, ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూములను తఃసిల్దార్ తో కలసి తనిఖీ చేసి నో. అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని మత్స్య శాఖ డిడి నిర్మలా కుమారి కి సూచించారు.
ఉద్యాన శాఖ ద్వారా ఉద్యాన పంటలకు, యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని, అదే విధంగా మార్కెటింగ్ సౌకర్యాల కల్పన పై దృష్టి పెట్టాలని ఉద్యాన , మార్కెటింగ్ శాఖల అధికారులకు ఆదేశించారు. గత సమావేశం నుండి ఈ సమావేశం వరకు నెల రోజుల వ్యవధిలో జిల్లాలో పరిశ్రమల స్థాపన కు 32 దరఖాస్తులు అందాయని, 15 దరఖాస్తు లకు అనుమతులు ఇవ్వడం జరిగిందని పరిశ్రమల జనరల్ మనేజర్ పాపారావు తెలిపారు. కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 16, గ్రౌండ్ వాటర్ వద్ద 1 దరఖాస్తు పెండింగ్ ఉన్నట్లు వివరించారు. టైం లైన్ లోపల అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని జె.సి సూచించారు. ఈ సమావేశంలో లైన్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.