ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం


Ens Balu
4
Kakinada
2022-08-27 13:09:10

గడచిన మూడేళ్ళలో కాకినాడ ప్రజలకు ప్రభుత్వం రూ.800 కోట్లు విలువైన సంక్షేమ పథకాలు అందించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని 4, 5,9 డివిజన్లలో రూ.3.70 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అలాగే రూ.1.09 కోట్ల వ్యయంతో నాడు–నేడు పథకంలో 9 క్లాస్‌ రూమ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, ఏ డి సి సి హెచ్ నాగ నరసింహారావు, అధికారులు,కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ  తన హయాంలో అమ్మ ఒడి, డ్వాక్రా రుణ మాఫీ, గృహనిర్మాణం, చేయూత వంటి వివిధ పథకాలు ద్వారా కాకినాడ ప్రజలకు ప్రభుత్వం ద్వారా రూ.800 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు.

 నాడు–నేడు పథకంలో రూ.10 కోట్లతో 106 కొత్త తరగతి గదులను కూడా తన హయాలోనే తీసుకొచ్చానన్నారు.  కాకినాడ నగరాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని,ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి తక్షణమే పరిష్కరించగలగుగుతున్నామన్నారు. టీడీపీ నేతలు కూడా గడపగడపకు మన ప్రభుత్వంలో తన వెంట వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ సత్యకుమారి, డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, లంకే హేమలత, కంపర బాబి, పలకా సూర్యకుమారి, పేర్ల జోగారావు, ఎంజీకే కిషోర్, గోడితోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.