సమస్యల పరిష్కారానికే మేమున్నది


Ens Balu
5
Kakinada
2022-08-27 13:52:01

కాకినాడ 12వ డివిజన్‌ పర్లోపేటలో శుక్రవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి  డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ళ ప్రభుత్వపాలనలో  ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, అధికారులు, కార్పొరేటర్లు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్‌ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో రూ కోటి వ్యయంతో మోడ్రన్‌ ఫిష్‌మార్కెట్‌ యార్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ సచివాలయానికి రూ.20లక్షల చొప్పున నిధులు విడుదల చేసేందుకు  ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీని వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ ఇంటికి వెళ్ళి  సమస్యలు తెలుసుకుంటామని ఎలాంటి అంశానైనా పరిష్కరిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ బెండా విష్ణుమూర్తి,  డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేషన్ కార్యదర్శి ఏసుబాబు, టి పి ఆర్ ఓ కృష్ణమోహన్, డి ఈ మాధవి, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత,  మీసాల శ్రీదేవి, కామాడి సీత,  పినపోతు సత్తిబాబు, గోడి సత్యవతి, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, పలువురు అధికారులు ఉన్నారు.