పులి దాడిలో ఆవుల‌కు ప‌రిహారం పంపిణీ


Ens Balu
7
Vizianagaram
2022-08-28 16:15:23

పులి దాడిలో మృతి చెందిన రెండు ఆవుల‌కు రూ.35,000 ప‌రిహారంగా అంద‌జేసిన‌ట్లు జిల్లా అట‌వీ అధికారి ఎస్‌.వెంక‌టేష్ తెలిపారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌నర‌స‌య్య  ఆవుల‌ను కోల్పోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు చెక్కు రూపంలో ఆదివారం ఈ స‌హాయం అంద‌జేశామ‌ని పేర్కొన్ంనారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పులి బోను ర‌ప్పించామ‌న్నారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్ కూడా జిల్లాలో అందుబాటులో వుంచామ‌న్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పులికి సంబంధించి ఒక ప‌రిష్కారం ల‌భించ‌గ‌ల‌ద‌ని క‌న్స‌ర్వేట‌ర్ ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఎవరూ దిగాలు చెందాల్సిన పనిలేదని..పులిని పట్టుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నట్టు అటవీశాఖ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంతో విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.