జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో మెలగాలి


Ens Balu
8
Visakhapatnam
2022-08-28 16:26:08

వర్కింగ్ జర్నలిస్టులు చేస్తున్న వ్రుత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు అవసరమైన మెళకువలను నేర్చుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి, వాస్తవాలను త్వరిగతిన ప్రజలకు చేరవేయడానికి ఆస్కారం వుంటుందని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పూర్వ ఉప కులపతి ఆచార్య బాల మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం అల్లూరి సీతారామజరాజు స్మారక విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నిర్వహించిన ఒక రోజు పునఃశ్చరణ  తరగతులులో ఆచార్య వి. బాలమోహన్ దాస్ మాట్లాడుతూ, పలు అంశాలను ప్రస్తుతించారు. జర్నలిస్టులు అంకిత భావం, సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. చేస్తున్న పనిలో మరింత విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉండాలన్నారు. దానిని ఆచరణలో అమలు చేసుకుని స్వీయ వృద్ధిని సాధించుకోవాలన్నారు. రాసే వార్తా కథనాలు, న్యూస్ అన్ని పత్రికల్లోనూ ఒకే రీతిగా ఉండకూడదనీ చెప్పారు. అలా ఉంటే కాపీ న్యూస్ పాఠకులు భావించే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు తమని తాము సాంకేతికత పరంగా వృద్ధి చేసుకోవాలన్నారు. స్మార్ట్ సిటి రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, చాలా కాలంగా అనుకుంటున్న వర్కింగ్ జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు ఎన్ఎన్ఆర్ సహకారంతో నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ వర్కు షాప్ నిర్వహణ సాటి జర్నలిస్టుగా, నిర్వాహక సంస్థ వ్యవస్థాపకునిగా తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు విధి నిర్వహణలో నైపుణ్యాలనూ, మెళకువలనూ తెలిపే వర్కుషాపుల నిర్వహిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వర రావు  మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించడం ప్రభుత్వం చేసినట్లుగా బంగారు  అశోక్ కుమార్  రూపొందించారన్నారు. నెల రోజుల కృషి ఫలితం ఇందులో ఉందన్నారు. నిధుల సమీకరణ మొదలు అనేక ప్రయాశలకు ఓర్చి అధ్యక్షులు అశోక్ కుమార్ వహించిన పాత్ర.. విజయం వర్ణించలేనిదన్నారు. 

నూరు శాతం ప్రయోజనాత్మక  వర్కుషాప్..
ఒక రోజు కార్యశాలలో పలువురు జర్నలిజం ఉద్దండులు తమ ప్రజ్ఞాపాటవాలతో  చైతన్య దీప్తిలుగా నిలిచారు. అయిదు అంశాల్లో అయిదుగురు ఉద్దండులైనా లబ్ధప్రతిష్టులతో నిర్వాహకులు ఏర్పాటు చేసిన గెస్టు లెక్చర్స్ ప్రతి జర్నలిస్టుకూ తమ రంగంలో కొత్త ఉత్సాహాన్ని మార్గదర్శకత్వంను నింపింది. తొలుత ప్రారంభ ఉపన్యాసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విశ్విద్యాలయం శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ రెడ్డి తిరుపతిరావు వర్త రచన, చట్ట నింబంధనలు, క్రైం న్యూస్ సోషల్ మీడియాలో ఎదురవుతున్న సవాళ్లుపై ప్రసంగించారు. జర్నలిజం బోధకులు, సామాజిక పరిశోధకులూ, నవ  రచయిత డాక్టర్ జికెడి ప్రసాద్ తెలుగు జర్నలిజం నూతన ఆవిష్కరణలు అంశంపైనా,   విజయవాడ నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు బి.నగేష్ ఎలక్ట్రానిక్ మీడియాకు వార్తలు రాయడం ఎలా, సవాళ్లు పరిష్కారాలు అంశంపై విశ్లేషనాత్మక ప్రసంగం చేశారు. వార్త రచనలో నూతన పోకడలూ పత్రికలు, టెలివిజన్ మీడియాలపై ప్రభావం అంశం పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ జి. లీలా వర ప్రసాదరావు ప్రసంగించారు. చివరిగా వార్తలు సేకరణ, రచన, భాష, పత్యేక విభాగాలు (బీట్) అంశంపై విశాఖపట్నం రచయిత, సీనియర్ పాత్రికేయులు ఎన్ నాగేశ్వర రావు (ఎన్ఎన్ఆర్ఆ) వివరించారు. అనంతరం బాదంగీర్ సాయి వంటి జర్నలిస్టులు తమ ప్రస్తానం గురించి వివరించారు. కార్యక్రమం నిర్వహణలో కార్యవర్గ సభ్యులూ భాగం అయ్యారు. ఏకబిగిన సాగిన ఈ వర్కుషాప్ లో పాల్గొన్న పాత్రికేయులకు సర్టిఫికేట్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి. విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన వార్తల ప్రజెంటేషన్ తీరు తెన్నులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.