సివిల్స్ ప్రిలిమ్స్ పకడ్బందీగా నిర్వహించాలి...
Ens Balu
2
Tirupati
2020-09-21 15:40:53
తిరుపతి లో అక్టోబర్ 4న యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ ప్రిలిమినరీ పరీక్షలు 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని డిఆర్వో మురళి చెప్పారు. సోమవారం ఈ మేరకు పరీక్షల విధివిధాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, సివిల్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్ లు, పరీక్షా సమయం, కేంద్రాలలో పాటించాల్సిన నిబందనలు అభ్యర్థులకు అందాయని సూచించారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. అక్టోబర్ 1 న మరో మారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు వ్రాయనున్నారని, అర గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజీలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు. ఈ సమీక్షలో వెన్యూ సూపర్వైజర్లు ప్రకాష్ బాబు, సులోచనారాణి, మహాదేవమ్మ, బద్రమణి,పద్మావతమ్మ, వెంకటేశ్వర రాజు, కూల్లాయమ్మ , సావిత్రి , కృష్ణమూర్తి , శ్రీనివాసుల రెడ్డి, మధుసూధన రావు, ముణిరత్నం నాయుడు, సి. సూపర్ నెంట్ వాసుదేవ , డిటిలు లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.