విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 8,9 తేదీలు లో జరిగే నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమన్నీ పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో విజయవంతం అయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు పనిచేయాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఛాంబర్ లో డి-వార్మింగ్ కార్యక్రమం పై జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్లు ఆయా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఉండే పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఉండే టీచర్లు, లైన్ డిపార్ట్మెంట్లు తో ఏ.ఎన్. ఎం. , ఆశా వర్కర్స్ సహాయం తీసుకొని ప్రేత్యేక అవగాహన సమావేశం నిర్వహించాలని తెలిపారు.
అలాగే ఒకటవ ఏడాది పిల్లలు నుండి 19 ఏళ్ళు వయసు కలిగిన పిల్లలు వరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి టీచర్ పర్యవేక్షణ లో
అల్బెన్డ్ జోల్ మాత్ర మింగకుండా, చప్పరించే విధంగా చూడాలి అని తెలిపారు. ఈ మాత్రలు ఆరోగ్యం బాగోలేని వారికి, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి వెయ్యదు అని తెలిపారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లో అనివార్య కారణాలు వల్ల రాలేని వారికి , తిరిగి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగే మాప్ అప్ డే లో మాత్రలు వెయ్యాలి అని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు చేతికి మాత్రలు ఇవ్వవద్దు అని, అంగన్ వాడి , పాఠశాల, కళాశాలలో మాత్రమే వెయ్యాలి అని తెలిపారు. ప్రతి పి.హెచ్.సి లో అల్బెన్డ్ జోల్ మాత్రలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ పి.రవి కుమార్, డి.ఈ.ఐ.సి. మేనేజర్ లోకనాధ్, తదితరులు పోల్గొన్నారు.