అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-శ్రమ్ పథకంలో చేరేందుకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోనివారి కోసం ఆగస్టు 30, 31వ తేదీల్లో ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రత్యేకాధికారి బాలాజీ తెలిపారు. ఈ పథకంలో చేరటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అన్ని పథకాలను పొందవచ్చని, ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల చనిపోయిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇతర సౌకర్యాలు పొందవచ్చని పేర్కొన్నారు. కావున జిల్లాలోని అసంఘటిత రంగంలో పని చేస్తున్న వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, వాలంటీర్లు, కొరియర్ బాయ్స్, చిల్లర వర్తకులు, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతి వృత్తి పనివారు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలకు చెందిన సభ్యులు తదితరులు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సోమవారం ఓ ప్రకటన ద్వారా కోరారు. మొబైల్ నెంబర్‌తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా మొదటి పేజీ జెరాక్సు కాపీలను సచివాలయంలో అందజేయాలని సూచించారు.