విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 212 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 09, డి.ఆర్.డి.ఏ కు 20, అందగా అత్యధికంగా రెవిన్యూ కు సంబంధించి 143 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, ఉప కలెక్టర్లు సుదర్శన దొర, సూర్యనారాయణ, స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారం లో నాణ్యత ఉండేలా చూడలంబరు. అర్జీదారు తో మాట్లాడి వారికి సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు మాత్రమే రీ ఓపెన్ లోకి వెళ్లకుండా డిస్పోజల్ అవుతుందని అన్నారు. సమాధానానికి తగు ఫొటోగ్రాఫ్ ను కూడా అప్లోడ్ చేయాలన్నారు. ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. అధికారులు స్పందన లాగిన్ లో స్వయంగా వినతులు పరిశీలించి, సమాధానం నాణ్యత ఉండేలా పరిష్కారం చేయా లన్నారు. అనంతరం స్పందన లో వికలాంగుల శాఖ ద్వారా శరీరీక వికలాంగునుకి రూ . 40 వేల విలువ గల లాప్టాప్ ను కలెక్టర్ అందజేశారు. వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.