తెలుగు ఆధునిక భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సంధర్బం గా "తెలుగు భాషా దినోత్సవం" సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగుబాషాభివృద్దికి విశేషకృషిచేసారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసిగా వ్యవహారిక భాషా ఉద్యమానికి ముఖ్యంగా సవర, గిరిజన బాషల అభివృద్దికి అవిశ్రాంతంగా కృషిచేసారని తెలిపారు.
అన్ని శాఖల అధికారులు తెలుగు భాషను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాద్యాయులు మరియు కవులు తెలుగుబాషాభివృద్దికి కృషిచేసిన బెళగం భీమేశ్వరరావు, చింతా అప్పలనాయుడు లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు భావన, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఉమామహేశ్వరరావు, జిల్లా అధికారులు, కలెక్టరు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.