స్పందనకు హాజరుకాకపోతే చర్యలు తప్పవు
Ens Balu
6
2022-08-29 13:27:34
పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు భావన ప్రజలనుండి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత జిల్లా అధికారులకు నేరుగా అందజేసి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని, ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంయుక్త కలెక్టరు ఒ.ఆనంద్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్లక్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా స్పందన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వినతులు అందజేసారు. 118 వినతులు అందాయి.