డిసెంబర్ నాటికి 2744 టిడ్కో ఇళ్లు సిద్ధం


Ens Balu
14
Anakapalle
2022-08-29 13:36:09

పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 160 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న టిడ్కో ఇళ్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అనకాపల్లి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న సంకల్పించారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనకాపల్లి జిల్లాలో  టిడ్కో ఇళ్లను ఒక ఉద్యమంగా చేపట్టి అర్హులైన వారందరికీ అందించాలని మంత్రి అమర్నాథ్ ఆదిశగా అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురంలో 2744 టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది. ఇక్కడ పనులను మంత్రి అమర్ నాథ్ సోమవారం స్వయంగా పరిశీలించారు.

 సంబంధిత అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. 2744 ఇళ్లలో 300 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 2292 ఉన్నాయి. 365 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 96, 430 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 365 వున్నాయి.  వీటిలో 1352 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు మంత్రి అమరనాథ తెలియజేశారు. సుమారు 136.67 కోట్ల  రూపాయలతో 29 ఎకరాల్లో  ఈ ఇళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 95 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో రెండు మూడు నెలల్లో మౌలికసదుపాయాల పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రి తెలియజేశారు. మౌలిక సదుపాయాలకు 18.6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశామని, మురుగునీరు పోయేoదుకు నాలుగు కోట్ల రూపాయలతో సివరేజ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని, ఇల్లు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రాకపోతే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి, ఇక్కడ ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.