ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు


Ens Balu
8
Kakinada
2022-08-29 13:46:13

కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డిల‌తో కలిసి కారుణ్య నియామకం కింద ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. యార్లగడ్డ శ్రీనివాసరావు గ్రేడ్-2 వీఆర్వోగా వక్కలంక సచివాలయం, అంబాజీపేట మండలంలో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన భార్య ఉందుర్తి దుర్గా పార్వతిని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  గంటా రామకృష్ణ, గ్రేడ్-2 వీఆర్వోగా వాకతిప్ప గ్రామం, యు.కొత్తపల్లి మండలంలో పనిచేస్తూ మరణించగా ఆయన భార్య పితాని మహాలక్ష్మిని కాకినాడ డివిజన్‌లో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  మాదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గ్రేడ్-2 వీఆర్వోగా రామవరంగ్రామం, జగ్గంపేట మండలంలో ప‌నిచేస్తూ రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందగా ఆయన కుమారుడు మాదిరెడ్డి రాజా మురళీకృష్ణను పెద్దాపురం మండలం, పులిమేరులో గ్రామ రెవెన్యూ అధికారిగా నియమించారు.