అమ్మలాంటి తెలుగు భాషని మరువరాదని నగర మేయర్ గొలగాని వారి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాష కొరకు విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి 159 వ జయంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ తో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగు భాషా నిర్మాతలలో ముఖ్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో జన్మించారని, జీవిత కాలం తెలుగు భాష కొరకు, తెలుగు భాష ఔన్నత్యం కొరకు పాటుపడ్డారని గుర్తు చేశారు. అమ్మ లాంటి తెలుగు వాడుక భాష కొరకు అనేక ఉద్యమాలు చేశారన్నారు.
కొంతమంది ప్రాచీన భాష సంస్కృతం లో విద్యాబోధన జరగాలని వాదించే వారిని, కానీ ఆయన తెలుగు భాష స్వచ్ఛతంగా రాయడం చదవడం కొరకు పాటుపడే వారిని, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తెలుగు కమ్మదనాన్ని విద్యార్థులకు చూపించడమే కాకుండా ఎన్నో రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారిని తెలిపారు. రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా మేయర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, ప్రధాన ఇంజనీర్, పట్టణ ప్రణాళిక అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.