రాజరాజ నరేంద్రుని కోసం అందరికీ తెలియాలి


Ens Balu
5
Rajamahendravaram
2022-08-30 08:39:07

రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనను భవిష్యత్తు తరాలకు అందించే వారు చేసిన శాసనాలను ఫోటో ఫ్రేమ్ చెయ్యడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ట్రైనింగ్ కళాశాల ప్రొఫెసర్ డా ఆర్ వి వి రాజా గోపాలా చార్యులు కలెక్టరేట్ లో ప్రదర్శనగా ఉంచేందుకు కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ప్రొఫెసర్ గోపాలచార్యులు మన దేశ, మన ప్రాంత చారిత్రక ఆధారాలను సేకరించి ఒకే ఫ్రేమ్ గా రూపొందించి, వాటిని అందచెయ్యడం పట్ల కృషి చేసిన తీరు ఎందరికో ఆదర్శం అన్నారు. వెయ్య సంవత్సరకాలం నాటి చారిత్రక ఆధారాలు సేకరించడం ఒక ఎత్తైతే వాటిని ఒకటి గా రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఫ్రేమ్ ను కలెక్టరేట్ లో ప్రజల సందర్శన కోసం ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

ఈ సందర్భంగా సంబందించిన వివరాలు డా.ఆర్.వి.వి.రాజా గోపాలాచార్యులు తెలియచేస్తూ, 1912 వ సంవత్సరం లో జయంతి రామయ్య గారు ఆనాడు  శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనకు చెందిన చారిత్రక ఆధారాలతో ఒక ప్రచురణ చెయ్యడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరాన్ని తూర్పు గోదావరి జిల్లా కి ప్రధాన కార్యస్థానంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కలెక్టరేట్ కి బహూకరించడం జరిగిందన్నారు. ఇందులో ఆనాటి రాజ్యాభిషేకం సందర్భంగా శిలా శాసనం లో పేర్కొన్న సంగతులతో ఫోటో ప్రేమ్ తన స్వంత అభిలాష తో తయారు చేసి అందజేసినట్లు తెలిపారు. ఈ శాసన రాగి పత్రాలలో  ఆనాటి చారిత్రక ఆధారాలు పొందుపరిచామని పేర్కొన్నారు.