గృహనిర్మాణ లబ్ధిదారులంతా ఐసీఐసీఐ బ్యాంకులో వేగంగా ఖాతాలు తెరిచి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అగ్రిమెంట్లపైసంతకాలు చేస్తే ఇంటి నిర్మాణాలు ప్రారంభమ వుతాయని కార్పొరేషన్ కమిషనర్ కె.రమేష్ చెప్పారు. స్థానిక పేర్రాజుపేటలోని 5వ డివిజన్ సచివాలయంలో మంగళవారం బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13500 మంది గృహనిర్మాణ లబ్ధిదారులకు గాను ఇప్పటికే 10వేల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారన్నారు. మిగిలిన 3,500 ఖాతాలను కూడా త్వరగా తెరిపించి వీరంతా వేగంగా అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిఅయితే డిసెంబర్ నాటికల్లా ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సందర్భంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేందుకు వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీపీఆర్వో కృష్ణమోహన్, ఐదవ డివిజన్ కార్పొరేటర్‌నల్లబెల్లి సుజాత, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.