తెలుగువారి తొలి పండుగ వినాయక చవితిని జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. గణేష్ చతుర్ధి సందర్భంగా జిల్లా ప్రజలంతా మట్టిగణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆ గణనాధుని చల్లని చూపుతో, ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని, మన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతూ విఘ్నాలు తొలగిపోవాలని కోరారు. వినాయకచవితి జరుపుకొనే విషయంలో ప్రభుత్వం కొత్తగా ఎటువంటి నిబంధనలు పెట్టలేదని, ఇదంతా ప్రతిపక్షాల దుష్ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవాలని, మట్టి విగ్రాహాలను వినియోగించడం ద్వారా మరికొందరికి ఆదర్శంగా నిలవచ్చునన్నారు.