సచివాలయ పరీక్షలకు 2వ రోజు 69.5శాతం హాజరు..
Ens Balu
1
విశాఖపట్నం జిల్లా
2020-09-21 18:26:27
విశాఖపట్నం జిల్లాలో సచివాలయాల్లో నియామకాలకు రెండవ దఫా రాత పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. 54 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షల్లో 69.5 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈరోజు పరీక్షలకు 30,243 మంది హాజరు కావలసి వుండగా 20,897 మంది హాజరుకాగా, 9344 మంది హాజరుకా లేదు. ఉదయం పరీక్షలకు 19036 మందికి 12 952మంది (68 శాతం) హాజరవగా 6084 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 11,207 మందికి 7945 మంది (71 శాతం) హాజరవగా 3260 మంది హాజరు కాలేదు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో ఒకరు ఐసొలేషన్ గదిలో రాత పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మీడియాకి వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, ఐసోలేషన్ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదేవిధంగా మిగిలిన పరీక్షలు కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.