తిరుమలలో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచారణ కేంద్రాన్నిగురువారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలోని మరో 19 వసతి ఉప విచారణ కార్యాలయాలను కూడా ఇదే విధంగా త్వరిత గతిన ఆధునీకరించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవం తరువాత కొత్త కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు కేటాయించారు. నూతనంగా ఆధునీకరించిన ఎస్ఎంసి ఉప విచారణ కేంద్రంలో మూడు గదులు కేటాయింపు కౌంటర్లు, 25 మంది యాత్రికులు కుర్చునే విధంగా ఏర్పాటు చేశారు. భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దేవతా చిత్రాలు, "శ్రీనివాస కళ్యాణం" యొక్క భారీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
ఈ కార్యక్రమంలో ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో(ఆర్-2) భాస్కర్, ఇఇలు సురేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్) రవిశంకర్ రెడ్డి, విజివోలు బాలిరెడ్డి, మనోహర్, రిసెప్షన్ ఏఈవో రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.