అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 350 గ్రామాల్లో రీ సర్వే లక్ష్యం కాగా ఇంత వరకు 236 గ్రామంల్లో 80 వేల 617 ఎకరాలు రీ సర్వే పూర్తి అయిందని వివరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే శాఖ ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.