భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రాధాన్యత భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సిమెంటు ఎంత అవసరమో చెప్పాలని, అదనపు సిమెంట్ ఎంత అవసరమో తెలియాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భవనాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నందు వలన ఆలస్యం జరుగుతుందని కలెక్టర్ వివరించగా
వేరే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని కమీషనర్ కోన శశిధర్ చెప్పగా ఇప్పటికే కొంత వరకు నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.