రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలొ స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ జిల్లా అధికారి డా.పి .రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కిల్ హబ్ ల ఏర్పాటులో భాగంగా పాడేరు స్కిల్ హబ్ లో 30 మంది నిరుద్యోగ యువతకు డాటా ఎంట్రీ ఆపరేటర్ (కంప్యూటర్) కోర్సులో, రంపచోడవరం స్కిల్ హబ్ లో 30 మంది యువతకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. కంప్యూటర్ కోర్సులో శిక్షణకు డిగ్రీ పాసై, 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణకు పది, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన యువతీ,యువకులు అర్హులని తెలిపారు.
ఈ నెల ఆ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు ఆసక్తి, అర్హతలు గల యువతీ యువకులు ఈ నెల ఐదవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు ఈ నెల ఐదవ తేదీ లోగా 81796-13081, 83318-90681 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు ఈ నెల ఐదవ తేదీ లోగా 90147-67230, 63026-36174 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డా. రోహిణి వివవరించారు. ఈ శిక్షణ హబ్ లలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.