స్వమిత్వా సర్వే జిల్లాలో త్వరగా పూర్తిచేయాలి


Ens Balu
8
Bhimavaram
2022-09-02 14:18:50

పశ్చిమగోదావరి జిల్లాలో స్వమిత్వా కింద చేపట్టిన సర్వే తరగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ ఓ పి ఆర్ డి లను,  సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి స్వమిత్య , జగనన్న స్వచ్చ సంకల్పం  పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల్లోని  16 గ్రామాలలో  స్వమిత్య కార్యక్రమం చేపట్టడం జరరిగిందని దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ ఓ పి ఆర్ డి లకు వచ్చే వారంలో స్వమిత్య పై పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరు తెలిపారు. స్వమిత్వపై ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని ఈవోపీఆర్డీలు సర్వేయర్లు క్షుణ్ణంగా చదవాలని కలెక్టరు ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద అన్ని గ్రామాలలో అప్రోచ్ రోడ్లను  పరిశుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. 

గ్రామాలలో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని గ్రామాల్లో ఉన్న ఎస్ డబ్ల్యూ పి సిలో అన్ని  కంపోస్ట్ తొట్లు ప్రాసెసింగ్ జరగాలని ఆమె ఆదేశించారు.  జిల్లాలోని అన్ని గ్రామాలు పరిశుభ్రత తో ఉండాలని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డిపిఓ యం నాగలత ,  ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాషువా, ఈఓపిఆర్డీలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.